విశాఖ స్టీల్‌ ప్లాంట్‌‌పై వెనక్కి తగ్గని కేంద్రం.. అమ్మకంపై కీలక అడుగులు

-

న్యూఢిల్లీ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకంపై కేంద్రం కీలక అడుగులు వేసింది. కన్సల్టెంట్‌ నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌తో పాటు అనుబంధ సంస్థలన్నీ వందశాతం అమ్మకానికి పెట్టింది. ఏపీలోని జగ్గయ్యపేట, తెలంగాణలోని మాదారం స్టీల్‌ ప్లాంట్ మైన్స్‌ను కూడా అమ్మేందుకు మరో అడుగు ముందుకేసింది. బిడ్‌లో పాల్గొనేందుకు లక్ష రూపాయల డిపాజిట్, కోటి రూపాయల బ్యాంక్‌ గ్యారంటీ సమర్పించాలని నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా లీల్ అడ్వైజర్, ట్రాన్సాక్షన్స్ అడ్వైజర్ల కోసం బిడ్లు ఆహ్వానించింది. ఈ బిడ్లకు సంబంధించిన అప్లికేషన్లను ఆన్ లైన్లో అందుబాటులో ఉంచింది. ఈనెల 15న కేంద్రం ప్రీబిడ్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ నెల 28న దరఖాస్తుకు ఆఖరు తేదీగా నిర్ణయించింది.

కాగా ఈ జనవరి 27న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వందశాతం ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటీకే కేంద్ర నిర్ణయంపై విశాఖలో కార్మికులు, ప్రజల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు.. కార్మిక సంఘాల ఆందోళనలకు దిగాయి. ఇప్పటికే చేపట్టిన రిలే నిరాహార దీక్షలు విశాఖలోని కూర్మన్న పాలెం జంక్షన్ వద్ద కొనసాగుతూనే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news