ఎన్నికల విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలి.. మేము సిద్దంగా లేము !

-

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల ఎపిసోడ్లో గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఎన్నికలు నిలుపుదల విషయంలో గవర్నర్ చేసుకో జోక్యం చేసుకోవాలని నిమ్మగడ్డని రాజ్ భవన్ కి పిలిపించి మాట్లాడాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అంతే కాక ఉద్యోగులు తరపున ప్రభుత్వమే సుప్రీం కోర్టుకు వెళ్లాలని ఏపీ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. విధుల్లో చనిపోతామని ఆందోళన చెందుతున్నా రాజకీయ పార్టీలకు పట్టదా ? అని వారు ప్రశ్నిస్తున్నారు. లక్షల మంది ఉద్యోగులకు పీవీ కిట్ల ఇవ్వగలరా అని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

ఇక 11వేల మందికి పైగా పోలీసులు కరోనా బారిన పడ్డారని కరోనా భయంతో చాలా మంది ఉద్యోగులు సెలవుల్లో ఉన్నారని చెబుతున్నరు. ఉద్యోగులను ఒత్తిడికి గురి చేసేలా ఎన్నికలకు వెళ్లడం సరికాదని వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎన్నికల ప్రక్రియ ఆపాలని కోరుతున్నారు. రెండేళ్ల నుంచి ప్రత్యేక అధికారుల పాలనే ఉందని, ఇప్పుడు ఉద్యోగులను వేధించాల్సిన అవసరం ఏముంది..? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించకుంటే కొంపలు మునగవని ఏపీ ప్రభుత్వ ఉద్సోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news