బ్రేకింగ్; గ్రీన్, ఆరెంజ్ జోన్ లో మద్యం అమ్మకాలు…! కేంద్రం రూల్స్‌ ఇవే

-

లాక్ డౌన్ ని కేంద్రం మే 17 వరకు అంటే రెండు వారాలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కొన్ని గైడ్ లైన్స్ ని కేంద్రం విడుదల చేసింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అత్యవసర ప్రయాణాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. మే 17 వరకు అంతరాష్ట్ర రవాణాను పూర్తిగా నిషేధించింది. రాష్ట్రాల మధ్య రాకపోకలు లేవని చెప్పింది. గ్రీన్, ఆరెంజ్ జోన్ లో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది కేంద్రం.

మే 17 వరకు అన్ని విద్యా సంస్థలకు అనుమతి ఇచ్చింది. ఆరెంజ్ జోన్ లో కార్లలో ఇద్దరు బైక్ పై ఒకరు ప్రయాణం చేయవచ్చు అని చెప్పింది. ఆరెంజ్ గ్రీన్ జోన్ లో వ్యక్తిగత ప్రయాణాలకు అనుమతి ఇచ్చింది. గ్రీన్ జోన్లలో అన్ని రకాల కార్యాకలాపలకు అనుమతి ఇచ్చింది. గ్రీన్ జోన్ లో పరిమిత సంఖ్యలో బస్సు సర్వీసులు ఉంటాయని కేంద్రం పేర్కొంది. విపత్తు నిర్వహణ చట్టం 2003 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం.

బస్సుల్లో సామాజిక దూరం చాలా అవసరమని పేర్కొంది. రెడ్ జోన్స్ లో ఎలాంటి మినహాయింపులు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. గ్రీన్ జోన్స్ లో వైన్ షాపులకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. ఐదుగురికి మించకుండా ఆరు ఫీట్ల దూరంలో మద్యం విక్రయాలు చేసుకోవచ్చు అని పేర్కొంది. జోన్లతో సంబంధం లేకుండా రవాణా పై ఆంక్షలు ఉంటాయని కేంద్రం స్పష్టంగా చెప్పింది. కంటైన్మేంట్ జోన్ లో వంద శాతం లాక్ డౌన్ అమలులో ఉంటుంది. కేసులు పెరగడం తగ్గడాన్ని బట్టి జోన్లు నిర్ధారించుకునే వెసులుబాటు రాష్ట్రాలకు ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news