Lockdown 3.0 : మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు

-

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని రెండు వారాలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో లాక్ డౌన్ ని ఈ నెల 17 వరకు పెంచుతూ నిర్ణయం వెల్లడించింది కేంద్రం. రెడ్ జోన్ల పరిధిలో పూర్తి స్థాయిలో ఆంక్షలు కొనసాగుతాయని, అక్కడ లాక్ డౌన్ లో ఎలాంటి మార్పులు ఉండవని కాని గ్రీన్ జోన్ లో మాత్రం కొన్ని ఆంక్షలను సడలిస్తామని కేంద్రం పేర్కొంది.

మే 17 వరకు విమానాలు, మెట్రో, రైళ్లు ప్రయాణాలపై నిషేధం ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. స్కూళ్లు, ఆఫీసులు, కాలేజీలు, హోటల్స్, రెస్టారెంట్లు, జిమ్స్, సినిమా హాళ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ మూసివేసి ఉంటాయని కేంద్రం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పింది. అన్ని జోన్లకూ ఈ నిబంధన వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. రెడ్‌ జోన్లలో కార్లు, బైకులపై పలు ఆంక్షలతో అనుమతించింది. కార్లలో ఇద్దరు, బైకులపై ఒక్కరు మాత్రమే ఉండాలని పేర్కొంది. శనివారం ఉదయ౦ ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news