కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరల వివరాలు ఇవే …

-

ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం దేశానికి వెన్నెముక అయిన రైతులు పండించిన ధాన్యాలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తారన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు సంబంధించి కనీస మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం…

సాధారణ ధాన్యం ధరను రూ. 2040 నుండి రూ. 2183 కు పెంచడం జరిగింది.

అదే విధంగా ఎ గ్రేడ్ ధాన్యాన్ని రూ. 2063 నుండి రూ. 2203 వరకు పెంచింది.

మిల్లెట్స్ సజ్జల ధరలను రూ. 2350 నుండి రూ. 2500 వరకు పెంచింది.

మిల్లెట్స్ రాగులు ధరలను రూ. 3578 నుండి రూ. 3846 వరకు పెంచడం జరిగింది.

కందుల ధరను రూ. 6600 నుండి రూ. 7000 కు పెంచింది.

పెసలు రూ. 7755 నుండి రూ. 8558 వరకు పెంచింది.

మినుములు ధరను రూ.6600 నుండి రూ. 6950 వరకు పెంచడం జరిగింది.

ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ పంటల ధరలను నిర్ణయించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news