మూవీ అప్డేట్ : ఓటిటి లోకి “అవతార్ 2″… ఎందులోనో తెలుసా !

ఈ రోజు నుండి హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ దర్శకత్వం వహించిన అవతార్ 2 ది వే అఫ్ వాటర్ సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వచ్చింది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల అయిన అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్ లను అందుకుని ఘన విజయాన్ని అందుకుంది. అయితే థియేటర్ లలో చూసిన ప్రేక్షకులు కాస్త ఓటిటి లోనూ చూడడానికి ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. ఆక్షణం ఇప్పుడు రానే వహ్చింది… అధికారికంగా ఈ రోజు నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకు ముందు అవతార్ సినిమాను తెరకెక్కించగా అది బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీసిన ఈ సినిమా సైతం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. మరి ఓటిటి లోనూ ఈ సినిమా మరిన్ని రికార్డులను కొల్లగొడుతుందా చూడాలి.