దేశ వ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం సృష్టించింది. కారోనా ను కట్టడి చేసేందుకు కేంద్రం అనేక చర్యలు చేపడుతుంది. మునుపు లాక్ డౌన్ ప్రకటించింది. ఆపై మెల్లమెల్లగా సడలింపులు ఇవ్వడం ప్రారంభించింది, ఈపాటికే అనేక సడలింపులతో ఆన్ లాక్ 1.0 ను ప్రకటించిన కేంద్రం ఇప్పుడు మరిన్ని సడలింపులతో మార్గదర్శకాలతో ఆన్ లాక్ 2.0 ను ప్రకటించింది. పలు రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సూచనలతో కేంద్ర కేబినెట్ సూచనలతో కేంద్ర హోమ్ శాఖా ఆన్ లాక్ 2.0 లోని మార్గదర్శకాలు విడుదల చేసింది.. ఈ మార్గదర్శకాలు జులై 1 నుండి అమలు లోకి వస్తాయి.
అంలాక్ 2.0 లోని మార్గదర్శకాలు ఇవే….
- జాతీయ మరియు అంతర్జాతీయ విమాన సేవలను మరింతగా పెంచే దిశలో సన్నాహాలు చేస్తున్న కేంద్రం, వందే భారత్ మిషన్ లో భాగంగా మరింత మంది ప్రయాణికులకు ప్రాయనించే అవకాశం.
- కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నడపబడే కోచింగ్ సెంటర్లకు మరింత సడలింపు. కోచింగ్ సెంటర్లను జులై 15 నుండి ప్రారంభం చేసుకోవచ్చు.
- పాఠశాలలు కాలేజీలు జులై 31 తరువాత ప్రారంభం చేసుకోవచ్చు. 31 వరకు ఎటువంటి పాఠశాలలు కాలేజీలు తెరవబడవు.
- నాన్ కంటెయిన్ మెంట్ జోనే లలో జిమ్, స్విమ్మింగ్ పూల్, సినిమా హాల్లు, పార్కులు, ఎంటర్ టెయిన్ మెంట్ జోన్ల ప్రారంభం అవుతాయి.
- నాన్ కంటెయిన్ మెంట్ జోన్ లలో బార్ లకు సినిమా హాళ్ళకు అనుమతి.
- సామాజిక, క్రీడా, రాజకీయ కార్యక్రమాలకు అనుమతి లేదు.
- కంటెయిన్ మెంట్ ప్రాంతాల్లో ఇప్పటిలాగానే నియమాలు పాటించక తప్పదు. జులై 31 వరకు నియమాలు అమలు లోనే ఉంటాయి.
- రాష్ట్రీయ అంతర్ రాష్ట్రీయ రవాణా జరగదు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళేందుకు ఎవ్వరికీ అనుమతి లేదు.
- రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలు లోనే ఉంటుంది కానీ మరికొంత సేపు సడలింపును ఇస్తూ రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు పూర్తి కర్ఫ్యూ అమలవుతుంది.