క్యాన్స‌ర్ రోగుల‌కు రూ.15 ల‌క్ష‌లు సాయం… అర్హత మొదలు ఈ పథకం పూర్తి వివరాలు మీకోసం..!

-

చాలా మందికి ప్రభుత్వ స్కీమ్స్ వివరాలు తెలీవు. వీటిని తెలుసుకుంటే ఆ స్కీమ్స్ తాలూకా ప్రయోజనాలని పొందవచ్చు. ఎక్కువ మంది క్యాన్సర్ కారణంగా సతమతమవుతూ వుంటారు. క్యాన్స‌ర్ చికిత్స‌క‌య్యే ఖ‌ర్చు భ‌రించే స్తోమ‌త లేని నిరుపేద‌లు ఎందరో.. పేద క్యాన్స‌ర్ రోగుల‌ వైద్య ఖర్చు కోసం కేంద్ర ప్ర‌భుత్వం రూ.15 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆర్థిక సాయం ని అందిస్తోంది.

కానీ ఈ స్కీమ్ గురించి త‌గిన ప్రచారం లేక‌పోవ‌డం వలన ఎవరికీ తెలీదు. రాష్ట్రీయ ఆరోగ్య నిధి హెల్త్ మినిస్ట‌ర్స్ క్యాన్స‌ర్ పేషెంట్ ఫండ్ పేరిట ఈ స్కీమ్ ని అందిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం 2009లో ఈ ప‌థ‌కం ని తీసుకు వచ్చింది. దారిద్య్ర రేఖ‌కు దిగువ‌న ఉన్న పేద‌ల‌కు క్యాన్స‌ర్ చికిత్స కోసం ఈ స్కీమ్ హెల్ప్ అవుతుంది. దేశం లోని 27 ప్రాంతీయ క్యాన్స‌ర్ కేంద్రాలు లో ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు.

క్యాన్స‌ర్ రోగికి ఎంత వస్తుంది… ?

రూ. 2ల‌క్ష‌ల వ‌ర‌కు ఆర్థిక సాయం ఇస్తారు. ఒకవేళ అంత‌కంటే ఎక్కువ డ‌బ్బు అవసరం అయితే ఆ ద‌ర‌ఖాస్తుల‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ‌కు పంపుతారు. క్యాన్స‌ర్ రోగి ప‌రిస్థితిని బట్టీ గరిష్ఠంగా రూ.15 ల‌క్షల వ‌ర‌కు ఇస్తుంది. రేడియేష‌న్, యాంటీ క్యాన్స‌ర్ కీమోథెర‌పీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేష‌న్, రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు మరియు క్యాన్స‌ర్ గ‌డ్డ‌ల ఆపరేషన్ వంటివి చేయించవచ్చు.

అర్హత వివరాలు:

కేంద్ర ప్ర‌భుత్వం లేదా ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్దేశిత దారిద్య్ర రేఖ‌కు దిగువ‌న వున్నవాళ్లు ఈ స్కీమ్ కి అర్హులే. రేష‌న్ కార్డు లేదా వార్షికాదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం ని సంబంధిత ఎమ్మార్వో నుండి తీసుకోవాలి.

ఎక్కడ చికిత్స చేయించుకోవాలి..?

దేశంలో క్యాన్స‌ర్ రోగుల‌కు సంబంధించి 27 ప్రాంతీయ క్యాన్స‌ర్ కేంద్రాలు వున్నాయి. ఇందులోనే క్యాన్స‌ర్ రోగులు చికిత్స చేయించుకోవాలి. టెరిట‌రీ క్యాన్స‌ర్ సెంట‌ర్లు లేదా ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆసుప‌త్రుల్లోని క్యాన్స‌ర్ సెంట‌ర్ల‌లో చికిత్స పొందుతున్న వాళ్ళకే ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది. ప్ర‌తి సెంట‌ర్లోనూ ప్ర‌త్యేకించి ఫండ్ ని ఏర్పాటు చేసారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news