ప్రముఖ సామాజిక మాధ్యమమైన ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు షాక్. ఇన్‌స్టాగ్రామ్ సేవలకు తాజాగా తీవ్ర అంతరాయం కలిగింది. ఇవాళ ఒక్కరోజే వేలాదిమంది యూజర్లు యాప్‌లో సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లుగా సంస్థకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ ఔటేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది. యూకే నుంచి 2000 మంది, భారత్, ఆస్ట్రేలియా నుంచి 1000 మంది చొప్పున యూజర్లు ఈ సమస్యపై మెటా సంస్థకు రిపోర్ట్ చేసినట్లు వెబ్సైట్ పేర్కొంది.
మరోవైపు ఇన్‌స్టాగ్రామ్ డౌన్ కావడంతో యూజర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము కాస్త టైంపాస్ కావడానికి ఇన్‌స్టా యూజ్ చేస్తుంటే ఆ టైంలో ఇలాంటి టెక్నికల్ సమస్య రావడమేంటని ఫైర్ అవుతున్నారు. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కంటెంట్ క్రియేట్ చేసే కంటెంట్ క్రియేటర్స్ ఈ మాధ్యమం డౌన్ కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని మండిపడుతున్నారు. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని మెటాను కోరుతున్నారు.