డిస్నీ హాట్​స్టార్​ యూజర్లకు షాక్.. ఇక నుంచి ఆ సూపర్‌హిట్ షోస్ బంద్

-

ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫాం డిస్నీ+ హాట్​స్టార్​ తన సబ్​స్క్రైబర్​లకు​ బ్యాడ్​న్యూస్ చెప్పింది. ఇక నుంచి పలు షోస్‌ ఈ ప్లాట్‌ఫామ్‌ వేదికగా స్ట్రీమింగ్ కాబోవని స్పష్టం చేసింది. ఇటీవలే ఐపీఎల్ టోర్నీ​ ప్రత్యక్ష ప్రసార హక్కులను కోల్పోయిన హాట్​స్టార్​.. ఇప్పుడు ప్రముఖ హెచ్​బీఓ కంటెంట్​కు​ కూడా దూరమైంది. హాలీవుడ్​ సినిమాలతో పాటుగా ప్రముఖ షోలను అందించే హెచ్​బీఓ కంటెంట్.. మార్చి 31 నుంచి హాట్​స్టార్​లో ఉండదని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. సంస్థాగత ఖర్చులను తగ్గించుకోవాలని తీర్మానించుకున్న కొద్ది రోజులుకే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

ప్రముఖ హెచ్​బీఓ ఛానల్​లో ప్రసారం అయ్యే గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ద లాస్ట్ ఆఫ్ అజ్, ఇండస్ట్రీ, వాచెమెన్​ షోలకు భారత్​లో చాలా మంది అభిమానులు ఉన్నారు. అమెరికాలో ప్రసారం అయ్యే ఈ షోలు అదే రోజున హాట్​స్టార్​ ద్వారా భారత్​లో కూడా అందుబాటులోకి వచ్చేవి. ఇకపై మాత్రం అలా కుదరదు. అయితే.. ప్రస్తుతం 10 భాషల్లో లక్ష గంటలకు పైగా హాట్​స్టార్​లో ఉన్న టీవీ షోలు, సినిమాలు, రకరకాల స్పోర్ట్స్​ కార్యక్రమాలను చూసి ఆనందించవ్చని డిస్నీ+ హాట్​స్టార్ ట్వీట్​ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news