డిసెంబర్ 1 నుండి మళ్ళీ లాక్ డౌన్ !.. : కేంద్రం క్లారిటీ

దేశంలో కరోనా కేసులు మళ్ళీ భారీగా పెరుగుతున్నాయి. దీంతో మళ్ళీ దేశంలో లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే లాక్ డౌన్ విధించడంతో ఇప్పుడు మనదగ్గర కూడా లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక సోషల్ మీడియాలో దీనికి సంబంధించి అనేక ప్రచారాలు జరుగుతున్నాయి.

కరోనా కేసులు ఇంకా అదుపులోకి రానందున డిసెంబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారు అంటూ ఒక ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి సంబందించిన ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ ఫ్యాక్ట్ చెక్ పోర్టల్ వెంటనే స్పందించింది. మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారన్న వార్త నిజం కాదని కొట్టిపారేసింది. ఆ ట్వీట్‌ను ఎవరో మార్ఫింగ్ చేశారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. మరో సారి లాక్‌డౌన్‌ విధించడంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది.