ఏపీలో బిజెపికి ఆదరణ పెరుగుతుందని విశాఖపట్నంలోని వుడా చిల్డ్రన్ థియేటర్లో మేధావుల సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్యఅతిథిగా వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మోడీ కేంద్ర ప్రభుత్వం పథకాల వలన ఏపీలో బిజెపికి ప్రజాధరణ పెరుగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పుంజుకుంటున్న బిజెపిని చూసి ఓర్వలేని వాళ్ళు బిజెపిని ఉత్తర భారత పార్టీ అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
ఏపీలో ఈసారి కాకున్నా మరో 10 సంవత్సరాల తర్వాత అయినా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. బిజెపి హిందీ ఇతర రాష్ట్రాలపై బలవంతంగా భాషల్ని రుద్దుతుందని చెప్పే ప్రయత్నాలు చేశారని ప్రస్తుతం మా పార్టీ హిందీ మాట్లాడని ఇతర రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్నామని అన్నారు.