ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల పాలు చేసింది : డిప్యూటీ సీఎం భట్టి

-

 

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల పాలు చేసింది అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇవాళ రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.  ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచితంగా కరెంట్ అందించేందుకు చారిత్రాత్మకంగా భావిస్తున్నామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 

తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పిస్తాం. గ్యాస్ సిలిండర్ సబ్సిడీని అందజేస్తాం.  ప్రతినెల ఆయా కంపెనీలకు ప్రభుత్వం చెల్లించనుంది. మహిళా పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి మాత్రమే అది వర్తించనుంది. 500 కే గ్యాస్ పథకం ప్రారంభం, మహాలక్ష్మి పథకం గైడ్లైన్స్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రజా పాలనకు దరఖాస్తు చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులు. మహిళల పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news