తెలుగు సినిమా పేర్ల పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తెలుగు భాషను రక్షించుకోవాల్సిన బాద్యత మనందరి పై ఉన్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. తాజాగా హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న తెలుగు మహాసభలలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రాథమిక విద్య, పాలన వ్యవహారాలు, అధికారిక ఉత్తర్వులు తెలుగులోనే రావాలన్నారు. న్యాయస్థానాల్లో వానదలు, ప్రతివాదనలు, తీర్పులు తెలుగుతో పాటు ప్రాంతీయ భాషల్లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గతంలో సినిమాలకు అద్భుతమైన తెలుగు పేర్లు పెట్టేవారు.

కానీ ఇవాళ ఇంగ్లీషు పేర్లు పెడుతున్నారు. సినిమాల పేర్లు తెలుగులో ఉంటే బాగుంటుందన్నారు. కేంద్రం తీసుకురానున్న నూతన విద్యా విధానంలో మాతృ భాషకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. డిజిటల్ విభాగంలో తెలుగు భాష క్రోఢీకరించి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న పుస్తకాలు అన్నీ డిజిటలైజేషన్ చేయాలని తెలుగు కనుమరుగు కాకముందే పరిరక్షించుకోవాలని సూచించారు. విద్యార్థులు లేక తెలుగు విద్యా సంస్థలు మూతపడుతున్నాయి. ఈ పరిణాలపై మనమంతా ఆలోచించాలని సూచించారు కిషన్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version