రైల్వే శాఖ కీలక ప్రకటన, 14 తర్వాత రైళ్ళు…!

-

కరోనా వైరస్ నేపధ్యంలో దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని అమలు చేయడంతో అన్ని రైల్వే సర్వీసులను నిలిపివేసింది ఇండియన్ రైల్వే. కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో ముందస్తు చర్యలు తీసుకున్నారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు రైళ్ళను నిలిపివేశారు. గూడ్స్ రైళ్ళు మాత్రం ప్రస్తుత౦ దేశ వ్యాప్తంగా నడుస్తున్నాయి.

ఇది పక్కన పెడితే గత కొన్ని రోజులు గా రైల్వే సర్వీసులు నడుస్తాయి అనే ప్రచారం జరుగుతుంది. దీనిపై రైల్వే శాఖ స్పందించింది. ‘‘లాక్‌డౌన్ తర్వాత రైల్వే సేవల పునరుద్ధరణ, రాకపోకలపై మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ప్యాసెంజర్ సర్వీసుల పునఃప్రారంభానికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేస్తున్నాం. ఈ విషయమై ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పకుండా అందరికీ వెల్లడిస్తాం…’’ అని పేర్కొంది.

కొన్ని రోజులుగా రైల్వే సర్వీసులను పునరుద్దరించే అవకాశం ఉందని రిజర్వేషన్లు తెరిచే అవకాశం ఉందనే వార్తలు ఎక్కువగా వచ్చాయి. ప్రస్తుతం గూడ్స్ రైలు సర్వీసులను నడుపుతున్నారు. పాలు, బియ్యం, గోధుమలు సహా ఇతర నిత్యావసర వస్తువుల కోసం పార్సిల్ ట్రైన్లను ఇప్పటికే ప్రారంభించినట్టు తెలిపింది.ఇప్పుడు రైలు సర్వీసులను మొదలుపెడితే మాత్రం కరోనా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version