ప్రకాశం బ్యారేజీని సందర్శించిన కేంద్ర బృందం.. ధవళేశ్వరం వద్ద హై అలర్ట్

-

విజయవాడలోని ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం తాజాగా సందర్శించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే. దీంతో భారీగా పంట, ఆస్తి నష్టం సంభవించింది.దీంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఇటీవల కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీ,తెలంగాణలలో ఏరియల్ సర్వే నిర్వహించారు.అనంతరం గురువారం కేంద్ర బృందం బ్యారేజీని పరిశీలించింది. బ్యారేజీ నీటి ప్రవాహం,ఎంత నష్టం సంభవించింది అనే విషయాలను జలవనరుల శాఖ అధికారులు కేంద్ర బృందానికి వివరించారు.

ఈఎస్‌సీ వెంకటేశ్వర్లు ఇందుకు సంబంధించిన వివరాలను బృందానికి అందజేశారు.కాగా, ఈ నెల 1న రికార్డ్ స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని పేర్కొన్నారు. ఇక కృష్ణానది పరీవాహక ప్రాంతంలో పరిస్థితి,ముంపునకు సంబంధించిన వివరాలను ఈ బృందం దృష్టికి తీసుకువెళ్లారు. ఇదిలాఉండగా, ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దీంతో సముద్రంలోకి 15.24 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కోనసీమలో లంక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news