తిరుపతిలో ఇంటి వద్దకే గంజాయి డెలివరీ.. యువకుడి అరెస్ట్!

-

ఏపీలో మరోసారి గంజాయి కలకలం సృష్టించింది. మొన్నటివరకు గుట్టుగా కొనసాగిన గంజాయి అక్రమ విక్రయాలు.. ఇపుడు నేరుగా ఇంటివద్దకే డోర్ డెలివరీ చేయడం సంచలనం రేపింది. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కపాదం మోపాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తిరుపతిలో గంజాయి డోర్ డెలివరీ చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అతడి నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నగరి మండలం ఓజీ కుప్పానికి చెందిన యువకుడు శ్రీనివాస్..చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాలోచనతో గంజాయి రవాణా చేయడంతో పాటు విక్రయాలు చేస్తున్నాడు. తిరుపతి ఏజెన్సీలో గంజాయిని కిలో రూ.10 వేలకు కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి రూ.300కు అమ్ముతున్నాడు. గంజాయి కావాలని ఫోన్ చేస్తే స్విగ్గీ బాయ్‌గా వెళ్లి విక్రయాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో తిరుపతి మారుతీనగర్ కొత్తపల్లి క్రాస్ వద్ద నిఘా పెట్టి నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news