విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మరోసారి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. వైసీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రశ్నకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చారు. వంద శాతం ప్రైవేటీకరణకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని, స్టీల్ ప్లాంట్‌తో పాటు అనుబంధ సంస్థలను కూడా కలిపి ప్రైవేటీకరణ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఒడిశా, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలను ఇనుప ఖనిజం గనులను కేటాయించాల్సిందిగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోరిందని, అలాగే, కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ను కూడా విశాఖ స్టీల్ విజ్ఞప్తి చేసిందని అన్నారు. ఒడిశా ప్రభుత్వాన్ని ఓ ప్రత్యేక బ్లాక్ ను కేటాయించాలని కేంద్ర ఉక్కు శాఖ కూడా విజ్ఞప్తి చేసిందని పేర్కొన్నారు. “నవరత్న” సంస్థగా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేక వాణిజ్య, ఆర్థిక లావాదేవీలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.