ఏపీకి గుడ్ న్యూస్‌.. పోలవరం ప్రాజెక్డ్‌కు నిధులు విడుదల చేసిన కేంద్రం…

-

పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన రూ.5,400 కోట్లలో రూ.1,850 కోట్లు కేంద్రం రీయింబర్స్‌ చేసింది. 2018-19లో రాష్ట్రం ఖర్చుచేసిన రూ.1,850కోట్లను 2019-20లో తిరిగి చెల్లించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ నుంచి రాష్ట్రప్రభుత్వానికి లేఖ అందింది. జల వనరుల మంత్రిత్వ శాఖ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) నుంచి రుణాలు తీసుకొని వాటిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పిపిఎ) కు బదిలీ చేస్తుంది. ఆ తర్వాత నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అందుతాయి. 2014 తర్వాత రాష్ట్రప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం చేపడుతున్న వ్యయాన్ని రీయింబర్స్‌ చేయడంలో భాగంగా ఈ రూ.1,850 కోట్లను విడుదల చేశామని జలశక్తి శాఖ తన లేఖలో పేర్కొంది.

వాస్తవానికి ఈ నిధుల కోసం ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. జగన్‌ సర్కారు ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసి ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లింది. ఒకే కాంట్రాక్టు సంస్థ బిడ్‌ను దాఖలు చేయడంతో.. రీటెండర్‌గా ఖరారు చేసింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రానికి రూ.1,850 కోట్లు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలన్న నిబంధనను జలశక్తి శాఖ లేఖలో గుర్తు చేసింది. ప్రాజెక్టు ద్వారా విడుదల చేసే నీటిని పైపులైన్ల ద్వారా మైక్రో ఇరిగేషన్‌ కింద అందించేలా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version