తమను వదిలేసాడని చిరకాల మిత్రుడికి బిజెపి సర్కార్ షాక్, భద్రతనే తోలిగించింది

-

వ్యవసాయ చట్టాలపై బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) నుంచి శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) వైదొలిగిన కొన్ని వారాల తరువాత కీలక పరిణామం జరిగింది. కేంద్రం మాజీ మంత్రి, పార్టీ నాయకుడు బిక్రామ్ సింగ్ మజిథియా జెడ్-ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కవర్‌ ను ఉపసంహరించుకుంది. బిక్రామ్ సింగ్ మజితియాకు జెడ్-ప్లస్ సెక్యూరిటీని తొలగించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అకాలీదళ్ ఖండించింది.

బిజెపి సీనియర్ నాయకుడు హర్జిత్ సింగ్ గ్రెవాల్ రాజ్‌పురా కార్యాలయంలో గురువారం ఒక గొడవ జరిగింది. దీని తర్వాత బిక్రామ్ సింగ్ మజిథియా యొక్క జెడ్-ప్లస్ భద్రతను ఉపసంహరించుకునే నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. దీనితో ఆయనకు పంజాబ్ పోలీసులు భద్రతను ఇచ్చే అవకాశం ఉంది. బిక్రామ్ సింగ్ మజిథియాకు వై లేదా జెడ్ కేటగిరీ భద్రత కల్పించవచ్చని జాతీయ మీడియా పేర్కొంది. ఆయన భద్రత కోసం సిఐఎస్ఎఫ్ సిబ్బందిని నియమించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version