తెలంగాణలో 18,558, ఏపీలో 50, 677 టీచర్ పోస్టులు – కేంద్రం కీలక ప్రకటన

-

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో 2021-22 నాటికి 18,558 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్ లో కేంద్రం తెలిపింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య మూడేళ్లలో 30,001 నుంచి 30,023 కు పెరిగినట్లు పేర్కొంది.

ఇక వాటిలో విద్యార్థుల సంఖ్య కూడా 28,37,635 నుంచి 33,03,699కి చేరిందని వెల్లడించింది. ఇక ప్రైవేట్ స్కూళ్లలో చేరిన విద్యార్థుల సంఖ్య 11.8% పడిపోయినట్లు కేంద్రం పేర్కొంది.

అటు ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో 2021-22 నాటికి 50, 677 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మొత్తం పోస్టుల్లో ఇవి 16.64% అని వెల్లడించారు. 2019-20 లో 56, 739 మేర ఉన్న ఖాళీలు 2020-21 నాటికి 35,358 కి తగ్గాయని, 2021-22నాటికల్లా మళ్లీ 50, 677 కి పెరిగాయన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 40,42,535 నుంచి 46,86,207 కి పెరిగినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version