విద్యుత్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన.. ఆందోళన అవసరం లేదు !

-

మన దేశంలోని పలు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరతపై ఇవాళ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధిత మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో పాటు, ప్రభుత్వరంగ సంస్థ NTPC లిమిటెడ్ కు చెందిన అధికారులు కూడా హాజరు అయ్యారు.

దేశ రాజధాని న్యూ ఢిల్లీ తో పాటు, ఇతర నగరాల్లో తక్షణం ఏర్పడే విద్యుత్ అంతరాయం భయాలను తొలగించడానికి విద్యుదుత్పత్తి కేంద్రాల డిమాండ్‌ను తీర్చడానికి భారతదేశంలో తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాల్లో ప్రస్తుత బొగ్గు నిల్వలు దాదాపు 7.2 మిలియన్ టన్నులు ఉన్నాయని… ఈ నిల్వలు నాలుగు రోజులకు సరిపోతాయని తెలిపింది బొగ్గు మంత్రిత్వ శాఖ.

ప్రభుత్వ యాజమాన్యంలోని మైనింగ్ దిగ్గజం “కోల్ ఇండియా” వద్ద 40 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు నిల్వ ఉన్నాయని కేంద్రం ప్రకటన చేసింది. విద్యుదుత్పత్తి కేంద్రాలకు సరిపడా ఈ నిల్వలను సరఫరా చేయడం జరుగుతుందని రాష్ట్రాలకు కేంద్రం హామీ ఇచ్చింది. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుందనే భయం పూర్తిగా తప్పని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version