ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని పై… నిర్ణయం ఆ రాష్ట్రాన్ని దేనని… కేంద్రమంత్రి నిత్యానంద రాయి ప్రకటన చేశారు. తమ దగ్గర.. ఉన్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతి అని కుండబద్దలు కొట్టారు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్.
రాజ్యసభ సభ్యులు, బిజెపి నాయకులు జీవీఎల్ నరసింహారావు అమరావతి రాజధాని పై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమాధానమిచ్చారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని స్పష్టం చేశారు. తమ దృష్టిలో ఇప్పటికి కూడా అమరావతి రాజధాని అని తెలిపారు.
కాగా.. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని పై ప్రతి పక్షాలు, అధికార వైసీపీ పార్టీల మధ్య గత ఏడాదిగా వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే.. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.