అమెరికాకు చైనా వార్నింగ్‌.. రెండు భారీ క్షిపణుల ప్రయోగం..

-

కరోనా నేపథ్యంలో ఇప్పటికే చైనాపై ఆగ్రహంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ దేశానికి చెందిన కంపెనీలు, యాప్‌ లు, ఇతర సర్వీస్‌లను అందించే సంస్థలపై నిషేధం విధించే పనిలో ఉన్నారు. అయితే దీంతోపాటు అమెరికా చేపడుతున్న పలు చర్యలు చైనాకు ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో చైనా తాజాగా రెండు భారీ క్షిపణులను ప్రయోగించి అమెరికాకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది.

దక్షిణ చైనా సముద్రంలో చైనా తాజాగా రెండు భారీ క్షిపణులను ప్రయోగించింది. అక్కడి హైనాన్‌ ప్రావిన్స్, పారాసెల్‌ దీవుల వద్ద చైనా ఈ క్షిపణి ప్రయోగాలు చేపట్టింది. క్వింఘాయి ప్రావిన్స్‌ వద్ద డీఎఫ్‌-26బి మిస్సైల్‌ను, జేజియాంగ్‌ ప్రావిన్స్‌ వద్ద డీఎఫ్‌-21డి మిస్సైల్‌ను ప్రయోగించింది. అయితే ఇందుకు కారణాలను కూడా చైనా తెలియజేసింది.

అమెరికాకు చెందిన ఆర్‌సీ-135 ఎస్‌ యుద్ధ విమానం చైనా దక్షిణ సముద్రం వద్ద సైనిక నియంత్రిత గగనతలంలో విహరించిందని చైనా తెలిపింది. అయితే ఇది మొదటిసారి కాదని, ఇప్పటికే పలు మార్లు ఈ విధంగా అమెరికా చేసిందని, అమెరికా యుద్ధ విమానాలు, సైనిక దళాలు అనేక సార్లు తమ గగనతలంలోకి చొరబడ్డాయిన, అందుకనే ఈ విధంగా అమెరికాకు వార్నింగ్‌ ఇచ్చామని చైనా తెలిపింది. దీనిపై ఇతర దేశాలు తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరింది.

కాగా అమెరికా ఇప్పటికే చైనాకు చెందిన పలువురు అధికారులే కాక, వ్యాపారులు, వారి కుటుంబ సభ్యుల రాకపోకలపై కూడా ఆంక్షలు విధించింది. దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్‌ సైనిక స్థావర నిర్మాణానికి కారణమయ్యారంటూ అమెరికా చైనా అధికారులపై ఆంక్షలు విధించింది. దీంతో చైనా ఆ క్షిపణులను ప్రయోగించి అమెరికాకు వార్నింగ్‌ ఇచ్చింది. అయితే దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version