బీజేపీని కనీసం 200 సీట్లు గెలవమని సవాల్ చేస్తున్నా : మమతా బెనర్జీ

-

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ గెలుపు ధీమాపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా గెలుపొందాలనే బీజేపీ లక్ష్యాన్ని ఎగతాళి చేసిన దీదీ.. కనీసం 200 నియోజకవర్గాల్లోనైనా గెలవాలని కాషాయ పార్టీకి సవాలు చేస్తున్నాను అన్నారు. ‘వచ్చే ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాల్లో గెలుస్తామని చెబుతోంది. ముందుగా వారు 200 సీట్ల బెంచ్ మార్క్ దాటాలని సవాలు చేస్తున్నాను. 2021లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో 200 కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో గెలుస్తామన్నారు.

కానీ 77కే పరిమితమయ్యారని దీదీని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడానికి తాను అనుమతించను. సీఏఏ కోసం దరఖాస్తు చేయడం వల్ల దరఖాస్తుదారులు విదేశీయులుగా మారతారని, కాబట్టి ఎవరూ దరఖాస్తు చేయవద్దని ఆమె ప్రజలను హెచ్చరించారు. చట్టబద్ధమైన పౌరులను విదేశీయులుగా మార్చేందుకే సీఏఏ ఒక ఉచ్చులాగా బీజేపీ వాడుతోంది. అందుకు తాను ఒప్పుకోను అన్నారు. సీపీఎం, కాంగ్రెస్పై కూడా మమతా విరుచుకుపడ్డారు. ‘పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమి లేదు. బెంగాల్లో సీపీఎం, కాంగ్రెస్ బీజేపీ కోసం పనిచేస్తున్నాయ న్నారు. ఇదే సమయంలో మా అంపీ మహువా మొయిత్రా బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పినందుకే ఆమెను అవమానించి లోక్సభ నుంచి బహిష్కరించారని దీదీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version