ఈరోజు జరిగిన భారత్ బంద్ కు సంబంధించి బండి సంజయ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. రైతులు పాల్గొనని ఆందోళన జరిగిందని ఆయన అన్నారు. సీఎం ఆదేశాల మేరకు అధికారిక బందు నిర్వహించారు.. బంద్ విఫలం అయిందని సంజయ్ అన్నారు. రైతులు వ్యతిరేకిస్తున్నారు.. మా సన్నం వడ్ల సంగతి ఏంటని అడుగుతున్నారని ఆయన అన్నారు. ఈ ఆందోళనలో సీఎం ఎందుకు పాల్గొన లేదు ? అని ప్రశ్నించిన ఆయన ఫార్మ్ హౌస్ లోనో ప్రగతి భవన్ లో ఎందుకు పడుకున్నాడని అన్నారు.
బందుకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పడం లేదన్న ఆయన ఇన్ని రోజులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఫార్మ్ హౌస్ లో పండిన పంటకు ఎవరు ధర నిర్ణయించారు ? నీకో రూల్ ,రైతులకు రూలా అని ఆయన ప్రశ్నించారు. సన్న వడ్లు వేయమని చెప్పి రైతులను మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని ఆయన అన్నారు. సన్న వడ్లకు 2,500 ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సిందేనన్న ఆయన కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. త్వరలో చలో హైదరాబాద్ ఉంటుందన్న ఆయన అధికార పార్టీ కి పొలీస్ లు సహకరించినట్టే బీజేపీ కి సహకరించాలని అన్నారు.