IPL 2022 : ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా “బ్రావో” రికార్డు

-

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఆల్‌ రౌండర్‌ డ్వేన్ బ్రావో సంచలన రికార్డు బ్రేక్‌ చేశాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన లసిత్‌ మలింగ రికార్డును డ్వేన్‌ బ్రావో బ్రేక్‌ చేశాడు. ఇప్పటి వరకు డ్వేన్ బ్రావో..తన ఐపిఎల్‌ కెరీర్‌ లో 171 వికెట్లు తీసి.. మొదటి స్థానంలో నిలిచాడు. ఇక డ్వేన్ బ్రావో తర్వాత లసిత్ మలింగ 170, అమిత్ మిశ్రా 166 , పీయూష్ చావ్లా 157, హర్భజన్ సింగ్ 150 వికెట్లు పడగొట్టారు.

కాగా.. ర‌వీంద్ర జ‌డేజా సార‌థ్యంలో ఉన్న చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌రో సారి నిరాశే ఎద‌రైంది. ఇప్ప‌టికే కోల్‌క‌త్త నైట్ రైడ‌ర్స్ జట్టుపై ఓడిన చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు.. నిన్న లక్నో సూప‌ర్ జెయింట్స్ పై కూడా ఓట‌మి పాలైంది.

6 వికెట్ల తేడాతో ల‌క్నో సూప‌ర్ జెయింట్ విజ‌యం సాధించింది. కాగ ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. చెన్నై సూప‌ర్ కింగ్స్.. నిర్ణిత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి.. 210 ప‌రుగులు చేసింది. అయినప్పటికీ… 211 భారీ ల‌క్ష్యాన్ని లక్నో అవలీలగా ఛేదించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version