వైసీపీ పాలనలో నరకయాతన అనుభవించారు ప్రజలు: చంద్రబాబు

-

ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలందరూ కూడా నరకయాతన అనుభవించారని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెప్పారు ఉమ్మడి కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసిపి ఐదేళ్ల పాలనలో ప్రజలందరూ కూడా నరకయాతన అనుభవించారని చెప్పారు. పార్టీ నేతలు కార్యకర్తలని సామాజిక ఉద్యమకారులని ఆ సైకో బారి నుండి కాపాడుకోవడానికి నిద్రలేని రాత్రులు గడపమని చెప్పారు.

జగన్ ఆఖరికి అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టించారని ఆయన గుర్తు చేశారు. జైలు నుండి వచ్చాక అక్కడ నుండి విజయవాడ రావడానికి 16 గంటలు పట్టిందంటే ప్రజలు తన మీద చూపిన అభిమానం జీవితంలో ఎన్నడు మర్చిపోలేనని అన్నారు నా ప్రాణం ఉన్నంత దాకా ప్రజల సేవకి అంకితం అవుతానని చంద్రబాబు నాయుడు చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version