“వైశ్రాయ్ వెన్నుపోటు – అమరావతి రైతుల గుండెపోటు”… మధ్యలో బాబు!!

-

చంద్రబాబు రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతో మొదలైనప్పటికీ… ఎన్టీఆర్ అల్లుడైనప్పటినుంచే ఆయన అసలు సిసలు రాజకీయ జీవితం ప్రారంభమైనట్లు లెక్క! అప్పటివరకూ తన తోలల్లుడు, మొదలైన కొందరికి మాత్రమే తెలిసిన చంద్రబాబు నిజస్వరూపం.. ప్రపంచానికి తెలియడం మొదలైన సమయం! ఆ క్రమంలో జరిగిన ఒక దుర్ఘటన వైశ్రాయ్ హోటల్ వ్యవహారం! నాటి నుంచి బాబు రాజకీయ జీవితమే మారిపోయింది. ముఖ్యమంత్రి కుర్చీ దక్కింది!!

అవును వాస్తవాలు మాట్లాడుకోవాలంటే… వైశ్రాయ్ హోటల్ సంఘటన బాబు జీవితాన్ని మలుపుతిప్పింది.. ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని నాశనం చేసింది. కలలుగన్న ఆశలు, కట్టుకున్న “టీడీపీ” అనే సౌధం తనది కాకుండా పోయింది. నాడు లక్ష్మీపార్వతి రూపంలో బాబుకు ఒక దారం దొరికింది.. దాంతో బాబు ఎన్టీఆర్ అనే కొండను కదిలించగలిగారు.. టీడీపీ అనే సౌధాన్ని లాగేసుకున్నారు. అయితే అది గతం!

అయినా కూడా నాడు జరిగింది “వెన్నుపోటు కాదు.. ప్రజావసరమైన ప్రమాధం” అన్న రేంజ్ లో బాబు సమర్ధించుకున్నప్పటికీ… అనంతరం కాలంలో కూడా బాబు పద్దతి అలానే ఉండటంతో… అది “ప్రమాధం కాదు, పక్కా స్కెచ్” అని ఫిక్సయిపోయారు ఒకవర్గం ప్రజలు! ఈ క్రమంలో నాటినుంచి మొదలైన బాబు అసలు సిసలు రాజకీయ జీవితం… నేడు అమరావతితో ముగియనుందనే విశ్లేషణలు మొదలైపోయాయి!

అవును… కుట్ర రాజకీయాలు చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైకాపా నాయకులు అన్నా అనకపోయినా… ఇంతకాలం తనదైన రాజకీయాలు నడిపిన బాబుకు రాజకీయంగా అస్తమించేసమయం, కనుమరుగయ్యే దశ వచ్చేశాయనేదీ.. తాజాపరిస్థితులను బట్టి చెబుతున్న విశ్లేషకుల మాట!! “ఎన్నో క్లిష్ట పరిస్థితులను చూశాను… ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నాను.. ఇవేమీ నాకు కొత్తకాదు” అని బాబు అసెంబ్లీలో చెప్పేవారు! అయితే… ఇప్పుడు వచ్చింది ఒడిదుడుకు కాదు… ఎత్తుకుపోయే సునామీ, పునాదులు కదిలించి కూల్చేసే భూకంపం!!

సరిగ్గా ఆలోచిస్తే… ఇప్పటికే బాబు అటు సీమ, ఇటు ఉత్తరాంధ్ర ప్రజలకు పరోక్షంగా దూరమైపోయారు. అమరావతి తరలింపు జరిగిన అనంతరం… అమరావతి రైతుల విషయంలోనూ, కృష్ణా – గుంటూరు జిల్లాల ప్రజానికం విషయంలోనూ చేతకానివాడిగా, అసమర్ధుడిగా మిగిలిపోబోతున్నారు! దీంతో… చంద్రబాబు రాజకీయ జీవితానికి ముగింపు దశ వచ్చేసినట్లేనని… “వైశ్రాయ్ వెన్నుపోటు – అమరావతి రైతులకు గుండెపోటు” మధ్య జరిగిందే బాబు రాజకీయ జీవితం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!

Read more RELATED
Recommended to you

Exit mobile version