బాబుల ఆంగ్లం ట్వీట్స్… ఆన్ లైన్ లో కౌంటర్స్… హాస్పటల్ ప్రస్థావన!?

-

స్వర్ణ ప్యాలెస్ ‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దారుణమైన సంఘటనకు సంబంధిత ప్రైవేటు ఆసుపత్రుల అత్యాశ, నిర్లక్ష్యమే కారణమనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. వీటిపై ఇప్పటికే ప్రభుత్వం హాస్పటల్ పై కేసు నమోదు చేసింది. ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు ఏభై లక్షల పరిహారం ప్రకటించింది. హుటాహుటున ప్రభుత్వం తరుపున మంత్రులు ప్రమాధ స్థలికి చేరుకున్నారు.. వారికున్న శ్రద్ధ, బాధ్యతలను నిరూపించుకున్నారు!

అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత ట్విట్టర్ లో స్పందించారు. “ఈ ఉదయం విజయవాడ కోవిడ్ సెంటర్ ‌లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తీవ్ర వేదనకి లోనయ్యాను.. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అంటూ ఆంగ్లంలో స్పందించారు!

అనంతరం ప్రమథస్థలిని పరామర్శించిన టీడీపీ నేత బోండా ఉమ మైకందుకున్నారు! ఇది ఘోరమైన దర్ఘటనగా టీడీపీ భావిస్తోందన్నారు. (ఇప్పుడు కాదని ఎవరన్నారు – ఆన్ లైన్ లో కౌంటర్)! ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు తనకు ఫోన్ చేశారన్నారు. (రానని చెప్పారా.. రాలేనని చెప్పారా – ఆన్ లైన్ లో కౌంటర్)! మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 50లక్షలు పరిహారం ప్రకటించిందన్నారు. (సంతోషం.. డిమాండ్ చేసే అవకాశం లేదు)! కరోనా నుంచి కోలుకుందామని ఇక్కడకు వస్తే.. అగ్ని ప్రమాదం జరగి ప్రాణాలు పోవడం బాధాకరమైన విషయమన్నారు. (అవును అవును… – ఆన్ లైన్ కౌంటర్)!

ఇన్ని మాటలు మాట్లాడారు కానీ… ఈ ప్రమాధానికి కారణమైన రమేష్ హాస్పటల్ పై ఒక్క మాట కూడా టీడీపీ నేతలు మాట్లడలేదు. ఒక్క విమర్శా చేయలేదు. ఆ హాస్పటల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై కానీ.. వారి అత్యాశ ఫలితంగా జరిగిన దారుణంపై కాని ప్రస్థావించలేదు. ఎందుకంటారు…? అనేది నెటిజన్ల అనుమానంగా ఉంది! ఏది ఏమైనా… పరామర్శించడానికి, ప్రమాధంపై నేరుగా సమీక్ష జరపడానికి రాకపోయినా… చంద్రబాబు & చినబాబు ఈ దుర్ఘటనపై ఆంగ్లంలో ట్వీట్ చేశారు.. అంతే చాలు అని తమ్ముళ్లు హ్యాపీ ఫీలవుతున్నారు!

Read more RELATED
Recommended to you

Exit mobile version