బాబు మీద ఎస్సీ, ఎస్టీ కేసుతో సహా మొత్తం పది కేసులు

-

గత నెల 24వ తేదీన మంగళగిరి ఎమ్మెల్యే సీఐడీకి ఫిర్యాదు చేసిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఎస్సీ ఎస్టీ రైతులకు బెదిరించి కుట్రతో భూములు లాక్కున్నారని ఎమ్మెల్యే ఆర్ కె సిఐడికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. పరిహారం కూడా ఇవ్వకుండా అసైన్డ్ భూములను ప్రభుత్వమే తీసుకుంటుందని బెదిరించారని అలా దళిత రైతులను బెదిరించి భూములు లాక్కున్నారని సిఐడి కి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం మీద విచారణ జరపాలని ఆర్కే ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.

ఆర్కే ఫిర్యాదు చేసిన మరుసటి రోజు నుంచి సీఐడీ డీఎస్పీ  సూర్య భాస్కర రావు నేతృత్వంలో విచారణ కూడా మొదలైంది అని చెబుతున్నారు. ఈ నెల 12న అంటే సరిగ్గా నాలుగు రోజుల క్రితం సిఐడి డీఎస్పీ నేతృత్వంలోని బృందం నివేదిక కూడా దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నివేదికలో భూసేకరణ అక్రమాలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చింది సిఐడి. దీంతో అదే రోజు కేసు నమోదు చేసేందుకు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తో సహా మొత్తం పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని అంటున్నారు. ఇక చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు సైతం నోటీసులు జారీ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news