తాను అధికారం చేపట్టినప్పటినుంచీ బాబులో జీర్ణశక్తిని చంపేస్తున్నారు జగన్! తాను ప్రజలకు ఏ మంచి పనిచేసినా కూడా బాబు జీర్ణించుకోలేని పరిస్థితిని పరోక్షంగా జగనే కల్పిస్తున్నారు! కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాల అమలు విషయంలో వెనక్కి తగ్గకపోవడం ఒక కారణమైతే… తాజా విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన మరో ప్రధాన కారణం! మాట తప్పకపోవడం, మడమ తిప్పకపోవడం… నాడూ నేడూ ఒకే మాట మాట్లాడటం వంటి పనులు జగన్ చేయడం వల్లే… బాబులో జీర్ణశక్తి నశించిపోతుంది… ఇందుకు కచ్చితంగా జగన్ బాధ్యత వహించి తీరాలి!!
సాదారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ… వారిని ఆర్ధికంగా దెబ్బకొడుతూ… వారి ఆర్ధిక మూలాలపై దెబ్బ కొడుతూ… వారు గతంలో చేసిన అవినీతిపై ఎంక్వైరీలు వేస్తూ… వారి ఎమ్మెల్యేలకు ఎర వేసి కొన్నుక్కుంటూ… ఇబ్బందులు పెడతారు! కానీ… తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ, జనాలకు మరీ దగ్గరవుతూ… తన ప్రత్యర్ధులను ఇబ్బందికి గురిచేస్తున్నారు వైఎస్ జగన్! ఈ విషయమే బాబు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు! తాజాగా విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ వ్యవహారంలో మృతుల కుటుంబాలకు రూ. కోటి ఆర్ధిక సాయం ప్రకటించడం అనే విషయం… ఎంత బరిద్దామన్నా బాబుని సరిగా కూర్చోనివ్వడం లేదు!!
ఈ స్థాయిలో ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తే… అయితే అభినందించాలి, లేదంటే సైలంట్ గా ఉండాలి! కానీ… బాబు కాస్త డిఫరెంట్ కాబట్టి… డబ్బులివ్వమని ఎవరైనా అడిగారా? కోటి రూపాయలు ఇస్తే ప్రాణాలు తిరిగి వచ్చేస్తాయా? రూ.కోటి సరిపోతాయా? అంటూ అజీర్ణ మాటలు మాట్లాడుతున్నారు. ఒక పక్క ప్రపంచం మొత్తం (విశాఖ టీడీపీ ఎమ్మెల్యేతో కలిపి) జగన్ పనిని అభినందిస్తుంటే… బాబు మాత్రం… జగన్ ది అవగాహనా రాహిత్యం అని లైట్ తీసుకుంటున్నారు!
అక్కడితో ఆగారా… విశాఖలో గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ఐదుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేస్తే వాళ్లేం చేస్తారు? ఐఏఎస్ అధికారులకు సబ్జెక్ట్ తెలుసా? సైంటిఫిక్, టెక్నికల్ అంశాలు వాళ్లకి తెలియవు. ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్న నాకే స్టైరీన్ అంటే ఏంటో తెలియదు. ఇక ఐఏఎస్లకు ఏం తెలుస్తుంది. అందుకే అచ్చెన్నాయుడుతో త్రిసభ్య కమిటీ వేస్తున్నా! అని ప్రకటిస్తున్నారు! ఇవన్నీ అజీర్ణం తాలూకు లక్షణాలు కాకమరేమిటి? ఐఏఎస్ లు అంటే వారిలో వైద్య విద్యను అభ్యసించిన వారుంటారు, ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ చేసినవారూ ఉంటారు, తాము ఎంచుకున్న సబ్జెక్ట్ పై పూర్తి పట్టు సాధించిన వారే ఐఏఎస్ లుగా ఎంపికవుతారు! అలాంటి వారికి సబ్జెక్ట్ తెలియదు… అచ్చెన్నాయుడుతో కమిటీ వేస్తున్నాం అని బాబు ప్రకటించడాన్ని ఏమనుకోవాలి?