గుంటూరు కాకాని సమీపంలో లో దళిత విద్యార్థిని రమ్య హత్యపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు. స్వాతంత్ర దినోత్సవం నాడే విద్యార్థిని హత్య కలచి వేసిందని అన్నారు. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా బయటకు రా గలిగినప్పుడే అసలైన స్వాతంత్రం అని మహాత్ముడు దశాబ్దాల క్రితం అంటే రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ పాలనలో పట్టపగలు ఆడపిల్ల భద్రంగా ఉండగలిగినప్పుడు అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అని మహిళా లోకం భయంభయంగా బతుకుతోంది అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నివాసానికి దగ్గరలో ఘటన జరిగిందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 500కు పైగా మహిళలపై దాడులు జరిగాయి.. అత్యాచార ఘటనలు జరిగాయని అన్నారు.
చాలా కేసుల్లో నిందితులను పట్టుకోలేకపోయారని ప్రభుత్వ చేతకానితనం.. నిందితులకు ప్రభుత్వమే రక్షణ కల్పిస్తుందని ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితుడిని పట్టుకోలేకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చెల్లెలు సునీత రెడ్డి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిందంటే సామాన్యుల పరిస్థితి ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. మహిళలకు భద్రత కల్పించడం అంటే ప్రచారం కోసం కోట్లు ఖర్చుపెట్టి ప్రకటనలు ఇవ్వడం ..కేంద్ర ఆమోదం లేని దిశ లాంటి చట్టాలు అమలు చేయడం కాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం కఠినంగా రమ్య కేసులో నిందితులను కటినం గా శిక్షించాలని డిమాండ్ చేశారు. రమ్య కుటుంబానికి టిడిపి అన్ని విధాలా అండగా ఉంటుందని… న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు.