ఏపీ సీఎం జగన్‌ ఇంటి ముట్టడి… పరిస్థితి ఉద్రిక్తత

-

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి నివాసం ముట్టడికి అర్బన్ హెల్త్ సెంటర్స్ ఔటసోర్స్ ఎంప్లాయిస్ యూనియన్ యత్నించింది. అయితే..అర్బన్ హెల్త్ సెంటర్స్ ఔటసోర్స్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలను మార్గమధ్యం లో అడ్డగించారు పోలీసులు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న అన్ని క్యాడర్ ల ఉద్యోగులను కొనసాగించాలని డిమాండ్ అర్బన్ హెల్త్ సెంటర్స్ ఔటసోర్స్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్‌ చేస్తోంది.

కరోనా మహమ్మారి సమయం లో టెస్ట్ లు తాము చేసామని పేర్కొన్న ఉద్యోగులు… తమకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని అంటున్నారు. మొత్తం 5000 వేల మంది ఉద్యోగుల బావిష్యత్తును నాశనం చెయ్యొద్దని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఔట్ సోర్సింగ్‌ కోటాలో తీసుకున్న అపోలో యాజమాన్యం టెర్మినషన్ ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు. దీనిపై ప్రశ్నించేందుకే ముఖ్యమంత్రి జగన్‌ ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టామని పేర్కొన్నారు. న్యాయం కోసం వస్తే…తమను అరెస్ట్ చేస్తారా అంటూ ఉద్యోగులు నిలదీస్తున్నారు. ప్రస్తుతం ఆ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news