ఏపీలో గోదావరి జిల్లాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి..ఈ రెండు జిల్లాలు కలిపి 34 సీట్లు ఉన్నాయి. తూర్పులో 19, పశ్చిమలో 15 సీట్లు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీలు రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో టిడిపి-బిజేపి కూటమి కలిపి రెండు జిల్లాల్లో 29 సీట్లు గెలుచుకున్నాయి. వైసీపీకి 5 సీట్లు మాత్రమే వచ్చాయి.
2019 ఎన్నికల్లో రెండు జిల్లాలో వైసీపీ 27 సీట్లు గెలుచుకోగా, టిడిపి 6, జనసేన 1 సీటు గెలుచుకుంది. అయితే ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని అటు వైసీపీ, ఇటు టిడిపిలు ప్రయత్నిస్తున్నాయి. ఇక రెండు జిల్లాలో తమ పట్టు ఏంటో చూపించాలని జనసేన భావిస్తుంది. రాష్ట్రంలో జనసేనకు ఎక్కువ బలం ఉంది ఈ రెండు జిల్లాల్లోనే. అయితే ఈ రెండు జిల్లాలపై టిడిపి అధినేత చంద్రబాబు గట్టిగానే ఫోకస్ చేశారు. తాజాగా రెండు జిల్లాలని కలిపి జోన్‌గా పెట్టారు. రాష్ట్రంలో ఐదు జోన్‌లుగా పెట్టి బాబు..పార్టీని బలోపేతం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి జోన్ 2 సమావేశాన్ని తాజాగా నిర్వహించారు. నేతలకు ఇదేం ఖర్మ, ఓటర్ల లిస్ట్ వెరిఫికేషన్, ఇంటింటికి తిరగడంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. నేతలు తప్పనిసరిగా కార్యక్రమాలని చేయాలని, ఈ సారి రెండు జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించాలని సూచించారు.
అయితే ప్రస్తుతం రెండు జిల్లాలో టిడిపి-వైసీపీ నువ్వా నేనా అన్నట్లు ఉన్నాయి..జనసేన కొన్ని స్థానాల్లో బలంగా ఉంది. ఇదే సమయంలో పవన్ గాని టిడిపితో పొత్తు పెట్టుకుంటే డౌట్ లేకుండా రెండు జిల్లాల్లో టిడిపి-జనసేన కూటమికి ఆధిక్యం వస్తుంది. వైసీపీ బలం తగ్గడం ఖాయం. అంటే పవన్ సపోర్ట్ లేకుండా గోదావరి జిల్లాల్లో టిడిపి లీడ్ రావడం కష్టమే.