జూబ్లీహిల్స్‌లో ట్రైయాంగిల్ ఫైట్..మాగంటికి హ్యాట్రిక్?

-

తెలంగాణలో ఏపీ ఓటర్ల ప్రభావం ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ కూడా ఒకటి. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఉండే ప్రాంతంగా జూబ్లీహిల్స్‌ని చెప్పుకుంటారు. ఇక ధనివర్గాలు మాత్రమే కాదు…పేద వర్గాలు కూడా ఉన్నాయి. అయితే ఏపీ నుంచి సెటిల్ అయినవారు ఇక్కడ ఎక్కువ ఉంటారు. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగమ ఈ నియోజకవర్గం ఏర్పడింది.

ఎర్రగడ్డ, బొరబండ, యూసుఫ్‌గూడ, షేక్‌పేట, శ్రీనగర్ కాలనీ(కొంత పార్ట్) ప్రాంతాలతో కలిపి జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఏర్పడింది. 2009 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ నుంచి పి. విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికలోచ్చేసరికి గాలి మారింది. అటు ఏపీలో టి‌డి‌పి హవా ఉండటంతో..ఇటు ఏపీ ఓటర్లు ఉన్న తెలంగాణ నియోజకవర్గాల్లో టి‌డి‌పి సత్తా చాటింది. అందులో భాగంగా జూబ్లీహిల్స్‌లో టి‌డి‌పి గెలిచింది. టి‌డి‌పి నుంచి కమ్మ నేత మాగంటి గోపినాథ్ గెలిచారు. అయితే తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ అధికారంలోకి రావడం, ఓటుకు నోటు కేసుని అడ్డం పెట్టుకుని…బి‌ఆర్‌ఎస్..టి‌డి‌పి ఎమ్మెల్యేలని లాక్కున్న విషయం తెలిసిందే.

 

ఈ ఆపరేషన్‌లో భాగంగానే మాగంటి సైతం సైకిల్ దిగి..కారు ఎక్కారు. అలా బి‌ఆర్‌ఎస్ లో చేరిన మాగంటి..2018 ఎన్నికల్లో సైతం విజయం సాధించారు. బి‌ఆర్‌ఎస్ తరుపున నిలబడి గెలిచారు. ఇక వచ్చే ఎన్నికల్లో మరొకసారి పోటీకి రెడీ అవుతున్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. అటు బి‌జే‌పి కూడా బలపడుతుంది. బి‌జే‌పి నుంచి ఎవరు బరిలో ఉంటారో క్లారిటీ లేదు.

కానీ ఈ సారి జూబ్లీహిల్స్ లో ట్రైయాంగిల్ ఫైట్ జరగడం ఖాయం. అయితే ఇక్కడ ఎం‌ఐ‌ఎం, టి‌డి‌పిలకు కాస్త బలం ఉంది. ఎం‌ఐ‌ఎం పోటీ చేయకుండా బి‌ఆర్‌ఎస్‌కు మద్ధతు ఇచ్చే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లో అదే చేసింది. అయితే టి‌డి‌పి పోటీ చేస్తే కొన్ని ఓట్లు చీలే ఛాన్స్ ఉంది.అది బి‌ఆర్‌ఎస్ పార్టీకే నష్టం చేయవచ్చు. చూడాలి మరి ఈ సారి మాగంటి హ్యాట్రిక్ కొట్టగలరో లేదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version