పేదలకు మంచి జరుగుతుంటే చూడలేని శాడిస్టు చంద్రబాబు : వైఎస్ జగన్

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రకాశం జిల్లా ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.పెన్షన్లు ఇంటికి రానివ్వకుండా అడ్డుకున్న చంద్రబాబు నాయుడు పెద్ద శాడిస్టు అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

‘పేదలకు మంచి జరుగుతుంటే చూడలేనివాడే శాడిస్టు. పేదవాడు పెద్దవాడవుతుంటే ఓర్వలేనివాడే శాడిస్టు. పేదల ఇళ్ల పట్టాలపై కోర్టుకు వెళ్లేవాడు శాడిస్టు. వ్యవసాయం దండగ అనేవాడే శాడిస్టు. ఫ్రీ విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలారేసుకోవాలన్నవాడే శాడిస్టు. వాలంటీర్లను ఆంబోతులని కించపరిచిన వ్యక్తి శాడిస్టు’ అని సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు దారి అడ్డదారి.. పేదల భవిష్యత్‌ను అడ్డుకునేందుకు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి అని వైఎస్ జగన్ అన్నారు. ప్రజల ఎజెండాతో మనం.. జెండాలు కట్టి వాళ్లు.. జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. ప్రజలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు” అంటూ మండిపడ్డారు వైఎస్ జగన్

.

Read more RELATED
Recommended to you

Exit mobile version