2014,2019 లో జరిగిన ఎన్నికల లో చంద్రబాబు ఫై పోటీ చేసిన కుప్పం వైస్సార్సీపీ అభ్యర్థి చంద్రమౌళి కన్నుమూశారు.ఆయన గత కొంతకాలంగా కాన్సర్ తో బాధ పడుతున్నారు. అయినా ఈ రోజు హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతిచెందారు.అయన మృతి ఫై ముఖ్యమంత్రి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన చంద్రమౌళి కుప్పం నియోజకవర్గంలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేసేవారని అన్నారు. సివిల్ సర్వెంట్‌గా, వైసీపీ నేతగా చంద్రమౌళి చేసిన సేవల ద్వారా ఆయన ప్రజల్లో గుర్తుండిపోతారని అన్నారు. చంద్రమౌళి కుటుంబానికి జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
చంద్రమౌళి మృతి పై మాజీ ముఖ్య మంత్రి ,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపంవ్యక్తం చేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ శాఖల్లో చంద్రమౌళి ఉత్తమసేవలు అందించారని గుర్తు చేసుకున్నారు . చంద్రమౌళి మృతికి విచారం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు.చంద్రమౌళి 1990 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు.