పోల‌వ‌రం పాలైన చంద్రాలు ప‌రువు…!

-

పోల‌వ‌రం ఏపీకి ఇది వ‌ర ప్ర‌దాయ‌నిగా అభివ‌ర్ణిస్తున్నారు. మ‌రి అలాంటి పోల‌వరం ఏపీ ప్ర‌జ‌ల‌కు ఎప్పుడు అంకితం ఇస్తార్ అని ప్ర‌జ‌లంతా ఎదురు చూస్తున్నారు.  ఇప్పుడు ఏపీ మాజీ సీఎం చంద్రాలు ప‌రువు పోలవ‌రం పాలైంది.. అయ్యో  ఎంత ఘోరం జ‌రిగింది. నిప్పులాంటి ఏపీ మాజీ సీఎం చంద్రాలు ప‌రువు పోల‌వ‌రం పాలైవ్వ‌డమేంటీ.. అనుకుంటున్నారా.. అవును మ‌రి పోల‌వ‌రంను ఐదేండ్ల‌లో పూర్తి చేస్తాన‌ని ప్ర‌గాల్భాలు ప‌లికిన చంద్రాలు పోల‌వ‌రంను పూర్తి చేయ‌డంలో పూర్తిగా విఫ‌లం అయ్యాడు. అంతేనా.. పోల‌వ‌రం పేరుతో ఆయ‌న చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.. పోల‌వ‌రం ను పూర్తి చేశాము.. అని ప్రారంభోత్సవాలు కూడా జ‌రుపుకున్నారు. పూర్తి కాకుండానే ప్రారంభోత్స‌వాల పేరుతో ఊరేగిన చంద్రాలు ప‌రువు ఆనాడే పాయే..

ఇక ఏపీలో అధికారం చంద్రాలు చేజారే.. అధికారం కాస్తా అది ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్సార్ సీపీ త‌న్నుకుపాయే.. అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌తిప‌క్ష నేత‌కు క‌నీస గౌర‌వం ఇవ్వ‌కుండా గంజిలో ఈగ‌లా తీసేసిన చంద్రాలు ప‌రిస్థితి సీన్ రివ‌ర్స్ అయింది. ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ సీఎం కావ‌డం, సీఎంగా ఉన్న చంద్రాలు ప్ర‌తిప‌క్ష నేత‌గా మార‌డంతో అసెంబ్లీలో సీన్ ఎలా రివ‌ర్స్ అయిందో.. ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ పోల‌వ‌రంలో అవినీతి అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని, మేము అధికారంలోకి వ‌స్తే పోల‌వ‌రం ప‌నుల‌పై స‌మీక్ష నిర్వ‌హించి అక్ర‌మాల‌ను వెలికితీస్తామ‌ని ఆనాడే చెప్పారు.

దీంతో చంద్రాలు సీఎంగా వ్యంగంగా.. మీరు అధికారంలోకి రావ‌డం క‌ల అంటూ ఎద్దేవా చేశాడు.. ఆనాడు వైఎస్ జ‌గ‌న్ అన్న‌ట్లుగానే అధికారంలోకి రాగానే సీఎంగా అధికారం చేప‌ట్ట‌గానే పోలవ‌రం అక్ర‌మాల‌పై దృష్టి సారించారు. ముందుగానే పోల‌వ‌రం పై స‌మీక్ష నిర్వ‌హించి, పోల‌వరం సంద‌ర్శించి అక్ర‌మాల‌పై నిగ్గు తేల్చే ప‌నికి శ్రీ‌కారం చుట్టారు. ఇక పోల‌వ‌రం ఆనాడు స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్రారంభించారు. న‌డుమ చంద్రాలు స‌క్కంగా చేయ‌క‌పోవ‌డంతో అది కాస్త అవినీతి కి అడ్డాగా మారింది.. అందుకే పోలవ‌రంలో అక్ర‌మాల‌ను నిగ్గు తేల్చ‌డానికి పోల‌వరంలో రివ‌ర్స్ టెండరింగ్ తో ప‌నులు చేస్తామ‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

అన్న‌ట్లుగానే పోల‌వ‌రంలో కేవ‌లం రూ.300కోట్ల ప‌నుల‌కు రివ‌ర్స్ టెండ‌రింగ్ చేప‌ట్టాడు.. అది కాస్త మంచి ఫ‌లితాలే ఇచ్చిన‌ట్లు రివ‌ర్స్ టెండ‌రింగ్‌లో తేలిపోయింది. చంద్రాలు అధికారంలో ఉన్న‌ప్పుడు అధిక శాతంతో ప‌నులు ద‌క్కించుకున్న నిర్మాణ సంస్థే.. మళ్ళీ అదే ప‌నికి త‌క్కువ శాతానికి టెండ‌ర్ వేసి ప్ర‌భుత్వానికి రూ.58కోట్లు లాభం చేకూర్చారు. అంటే పోల‌వ‌రంలో త‌క్కువ మొత్తానికి ప‌నులు జ‌రుగాల్సి ఉన్నా చంద్రాలు ప్ర‌భుత్వం అప్ప‌నంగా ప‌నుల‌ను అప్ప‌గించి, అక్ర‌మాల‌ను క‌ళ్ళ‌ప్ప‌గించి చూసార‌ని ఈ రివ‌ర్స్ టెండ‌రింగ్‌తో తేలిపోయింది. దీంతో చంద్రాలు ప‌రువు పోల‌వ‌రంలో రెండోసారి క‌లిసే..

ఇక పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌రింగ్ తో వ‌చ్చిన లాభంపై అటు చంద్రాలు, ఇటు ఆయ‌న టిట్ట‌ర్ పిట్ట లోకేశాలు అవాకులు చ‌వాకులు పేలుతుండగా,  పోల‌వ‌రంపై రివ‌ర్స్ టెండ‌రింగ్‌తో ప్ర‌భుత్వం రూ.150కోట్లు న‌ష్టం జ‌రిగింద‌ని చంద్రాలు తాబేదారు అప్ప‌టి భారీ నీటిపారుద‌ల శాఖ‌మంత్రిగా పోల‌వ‌రంలో అక్ర‌మాల‌కు అండ‌గా ఉన్న దేవినేని ఉమా చిలుక‌ప‌లుకులు ప‌లుకుతున్నాడు.. రివ‌ర్స్ టెండ‌రింగ్‌తో ఓవైపు రూ.58కోట్లు ఆదా అయిన‌ట్లు అక్క‌డ స్ప‌ష్టంగా తెలుస్తుంటే.. ఇదేమి రివ‌ర్స్ డైలాగో అర్థం కాకుండా ఉంది.

అయితే చంద్రాలుకు తాబేదారుగా ప‌నిచేసిన టీడీపీ మాజీ ఎంపి జేసీ దివాక‌ర్‌రెడ్డి మాత్రం రివ‌ర్స్ టెండ‌రింగ్ తో త‌క్కువ వ్య‌యంతో ప్రాజెక్టు నిర్మాణం అయితే అది స్వాగ‌తించాల్సిందే అని అన్నారు. మ‌రి ఈ జేసీని చూసైనా చంద్రాలు, ఆయ‌న కొడుకు లోకేశాలు, తాబేదారు దేవినేని ఉమా మారుతారా అంటే అది లేదు.. ఏందో ఏమో.. సీఎం జ‌గ‌న్ ఎంత మంచి ప‌ని చేసినా దానిలో ఏదో లోపం ఎతికి ప‌ట్టుకోవాల‌నే ఆరాట‌మే త‌ప్పితే… మంచిగుంద‌ని మాత్రం ఒక్క‌ముక్క‌న్నా అన‌క‌పోయిరి.. అందుకే ఏపీ ప్ర‌జ‌లు చంద్రాలు స‌ర్కారు కర్రుకాల్చి వాత పెట్టిండ్లు..

Read more RELATED
Recommended to you

Latest news