చంద్రబాబు కొత్త నిర్ణయం… అవధులు దాటుతున్న తమ్ముళ్ల ఆనందం!

-

2019 ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు చేసిన ప్రజలకు పనికివచ్చే ఒక తాజా సూచనకు సదరు టీడీపీ కార్యకర్త మనసులో కలిగిన ఆనందం ఇది! అవును… ఆ మాటకు సదరు కార్యకర్తలు… “సార్ మీరు మారిపోయారండి” అని తెగపొగిడేస్తున్నారంట! ఇంతకూ సదరు టీడీపీ కార్యకర్తకు అంతగా ఆనందకలిగించిన ఆ మాట ఏమిటి.. ఆ కథాకమీషు ఏమిటి… ఇప్పుడు చూద్దాం!

కరోనా సమస్య రావడం.. అనంతరం జనతా కర్ఫ్యూ.. వెనువెంటనే లాక్ డౌన్ రావడంతో చంద్రబాబు హైదరాబాద్ లో ఉండిపోవాల్సి వచ్చింది. ఆ వయసులో ఆయనకు అది అదృష్టం అనుకోవాలో.. ఏపీ టీడీపీ కార్యకర్తల దురదృష్టం అనుకోవాలో తెలియని పరిస్థితి! ఎందుకంటే… ఇంత కష్టసమయంలో చంద్రబాబు ఏపీలో ఉంటే… రాజకీయ కోణంలో అయినా పర్లేదు కానీ… మరో 10 మందికి నిత్యావసర సరుకులు అందేవి.. మరో 10 మందికి కాయగూరలు అందేవి! కాస్తో కూస్తో “రాష్ట్రం నుంచి పారిపోయారు… పక్కరాష్ట్రంలో దాక్కున్నారు… హైదరాబాద్ లో కూర్చుని ఉచిత సలాహాలు ఇవ్వకండి” వంటి విమర్శలు అయినా తప్పేవి! పోనీ ఆయన లేకపోతే ఏమవుతుంది… చేయొచ్చు కదా అని ఎవరైనా అంటే… బాబు ముందు జాగ్రత్తలు బాబువి అనే ఆన్సర్ వస్తుంది! ఈ క్రమంలో చంద్రబాబు ఏమనుకున్నారో… ఇంక ఇప్పట్లో ఏపీకి వెళ్లే అవకాశాలు లేవనుకున్నారో.. లేక ఇప్పటికే ఆలస్యం అయ్యిందని భావించారో కానీ… ఉన్నఫలంగా 2.5 లక్షల మాస్కులు పంచేయండని సూచించారు.

అవును… తాజాగా ఏపీలోని వివిద మండలాల తెదేపా అధ్యక్షులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఈ సూచన చేశారు. ఇంతకాలం చేసిన వీడియో కాన్ఫరెన్స్ లలో… రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి అధ్యక్షులకు చేయని సూచనలు.. మండలిస్థాయి నాయకులకు మాత్రమే ఎందుకు చేశారబ్బా అనే అనుమానం కాసేపు పక్కన పెడితే… ఎన్టీఆర్‌ ట్రస్టు తరఫున 2.5 లక్షల మాస్కులను వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, అంగన్ వాడీ టీచర్లు, వాలంటీర్లు వంటి ఫ్రంట్ లైన్ వారియర్లకు అందజేయాలని మండలస్థాయి నాయకులకు బాబు సూచించారు!

సరే.. ఏదొకటిలే… ఇకపై మేము కూడా ఈ కరోనా సమయంలో ఏదో ఒకటి చేశామని అనిపించుకుంటాం.. కొద్దో గొప్పో విమర్శల నుంచి, జనం చీత్కారాలనుంచి తప్పించుకుంటాం… అని టీడీపీ కార్యకర్త తెగ సంబరపడిపోతున్నాడట. ఊర్లలో టార్చర్ లు అలా ఉంటాయిగా మరి!! అవేమో… అంతెత్తులో ఉండే పెద్ద నాయకులకు అర్ధం కావాయే!! ఇంతకూ ఎన్టీఆర్‌ ట్రస్టు తరఫున పంచమంటున్న ఈ 2.5 లక్షల మాస్కులను ఎవరి డబ్బుతో కొనాలి? మండలాల స్థాయిలో వీరికి డబ్బు మొత్తం హైదరాబాద్ నుంచి బాబే ట్రస్టు ద్వారా అందిస్తారా? లేక ఈ భారం మండలస్థాయి నాయకులపైనే వేస్తారా? అవన్నీ ఇప్పుడెందుకు…. బాబు మారారు అని ఫీలవుతున్న సదరు కార్యకర్తకు ఆ చిన్న ఆనందం కూడా లేకుండా చేయడానికి కాకపోతే!!

కాగా… వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, అంగన్ వాడీ టీచర్లు, వాలంటీర్లు వంటి ఫ్రంట్ లైన్ వారియర్లకు ఈపాటి సాయం చేయడానికే చంద్రబాబుకి ఇంత సమయం పడితే… ఇక సామాన్యుడికి సాయం అదించాలంటే… కరోనా కష్టకాలం దాటేయాల్సిందేనా? అని కామెంట్స్ వినిపిస్తున్నాయి!

Read more RELATED
Recommended to you

Exit mobile version