రోడ్డున పడనున్న ఇంజనీరింగ్ ఉద్యోగులు…!

-

అమెరికాలో కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్న నేపధ్యంలో ఆ దేశం ఇప్పట్లో రీ ఓపెన్ అయ్యే అవకాశాలు కనపడటం లేదు. ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అమెరికాలో ప్రముఖ కంపెనీలు, చిన్న చిన్న కంపెనీలు అన్నీ కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అవసరం లేదు అనుకున్న వాళ్ళను తప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. అంతే కాకుండా దీని నుంచి ఆర్ధిక కష్టాలకు కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు అని భావిస్తుంది.

అమెరికాలో ప్రముఖ కంపెనీలు అన్నీ కూడా వేలాది ఉద్యోగులను తొలగిస్తుండగా… మన దేశంలో అమెరికా మీద ఆధారపడి ఉద్యోగాలు చేసే వారు ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న కంపెనీలు అన్నీ కూడా ఉద్యోగులను నియమించుకుని అమెరికా సాఫ్ట్ వేర్ కంపెనీల మీద ఆధారపడి చేస్తున్నాయి. ఇప్పుడు ఆ కంపెనీలతో అమెరికా కంపెనీలు ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నారు.

రాబోయే రెండు మూడు రోజుల్లో ఉద్యోగులను అమెరికా భారీగా తొలగించే అవకాశం ఉంది. దీనితో పాటుగా కాంట్రాక్ట్ లను కూడా రద్దు చేసుకోవాలని చూస్తున్నారు. 5 వేల జీతం నుంచి ఇక్కడ ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నా సరే లాభం లేదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version