భువన్ పై చంద్రబాబు ప్రశంసలు..!

-

అతిచిన్న వయసులోనే ఆంధ్రప్రదేశ్ కు చెందిన భువన్ అనే 8 ఏళ్ల కుర్రాడు యూరప్ లో అత్యంత ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎల్ బ్రస్ ను అధిరోహించాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాంతో భువన్ పై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. కాగా తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు సైతం భువన్ పై ప్రశంసలు కురిపించారు.

ఇంత చిన్న వయసులోనే అద్బుతం సృష్టించావంటూ బాలుడిని చంద్రబాబు ప్రశంసించారు. అంతే కాకుండా ఎందరో టాలెంటెడ్ పిల్లలు ఉన్నారని..వారికి ప్రోత్సాహం ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా భువన్ 5642 మీ. ఎత్తైన శిఖరం ను ఎక్కిన అతి చిన్న వయస్కుడు గా చరిత్ర సృష్టించారు. ఇక భువన్ ఏపికి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ గంధం చంద్రుడు కుమారుడు కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version