దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు..!

-

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇవాళ సాయంత్రం హైదరాబాద్ నోవాలెట్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు టీమ్ సిద్దం అయింది. అందులో భాగంగా అభిమానులకు కొన్ని పాసులను జారీ చేశారు. పాసులు జారీ చేసిన దానికి మించి అభిమానులు, వేదిక వద్దకు చేరుకోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఉన్నట్టుండి ఒక్కసారిగా అభిమానులు లోపలికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించడంతో నోవాటెల్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. అలాగే ఎస్కలేటర్ కూడా ధ్వంసం అయినట్టు తెలుస్తోంది. ఈవెంట్ నిర్వహించడం కష్టమంటూ హోటల్ యాజమాన్యం చేతులెత్తేసింది. వెంటనే రంగంలోకి దిగిన ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ శ్రేయాస్ మీడియా.. కనీసం ఎన్టీఆర్ మాట్లాడటానికి అయినా అవకాశం ఇప్పించాలని యాజమాన్యంతో పాటు పోలీసులను కోరింది. పోలీసులు అభిమానులను క్లియర్ చేసేందుకు ప్రయత్నించారు. ఎన్టీఆర్ ఒకవేళ వస్తే.. ఆ బారికేడ్ల వెనుకాల నిలబడి మాట్లాడించి పంపించాలని ప్లాన్ చేశారు. కానీ ఎన్టీఆర్ లోపలికి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో నాటకీయ పరిణామాల మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించేశారు. కొద్ది సేపట్లోనే ఎన్టీఆర్ ఓ ప్రకటన విడుదల చేయనున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version