బాబు ఫోన్ చేశారంటే పనైపోయినట్లే… మరో సక్సెస్!!

-

చంద్రబాబు ఫోన్ లో మాట్లాడి రిజల్ట్ పొందినవి ఎక్కువా.. నేరుగా మాట్లాడి ఫలితం పొందినవి ఎక్కువా అంటే… ఫోన్ లో మాట్లాడి సెటిల్ చేసే విషయంలోనే బాబూ స్కోర్ ఎక్కువనే మాటలు వినిపిస్తుంటాయి! నిజంగా కూడా బాబు ఎక్కువ డీలింగ్స్ ఫోన్ ల ద్వారా సక్సెస్ చేయడంలో దిట్ట అని అంటుంటారు బాబుగురించి బాగా తెలిసినవారు! ఈ సక్సెస్ రేట్ విషయంలో గ్రాఫ్ పెంచుకుంటూపొతున్న క్రమంలో… అలా గ్రాఫ్ పెరిగే మరో ఫోన్ కాల్ సక్సెస్ స్టోరీ ఒకటి వెలుగులోకి వచ్చింది!

అప్పుడేదో “మావాళ్లు బ్రీఫ్డ్ మీ…” అంటు దొరికిపోయారు కానీ… లేదంటే బాబు ఫోన్ లో ఎలాంటి రాజకీయాలు చేస్తారు.. వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారు అనేది సామాన్యుడికి తెలిసుండేది కాదు! ఈ క్రమంలో కొద్దినెలల క్రితం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సైలంట్ గా ఉన్న ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ విషయంలో మరోసారి బాబు ఫోన్ అందుకున్నారంట!

అవును… కొన్ని నెలల క్రితం తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు నచ్చక తాను రాజీనామా చేస్తున్నట్లు కేఈ ప్రభాకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఏమనుకున్నారో ఏమో కానీ.. ఇంతకాలం తర్వాత ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కు స్వయంగా చంద్రబాబు ఫోన్ చేసినట్లు వార్తలు వచ్చాయి! ఏమి జరిగిదో.. ఎలా జరిగిందో.. తెలియదు కానీ… ఇంతకాలం బిగించుకుని కూర్చున్న ప్రభాకర్ ఉన్నపలంగా మెత్తబడిపోయారంట. త్వరలోనే మళ్లీ తిరిగి పార్టీలో చేరబొతున్నారట!

దీంతో… బాబు మరోసారి ఫోన్ కాల్ డీలింగ్స్ లో సక్సెస్ అయ్యారని అంటున్నారట సీమ తమ్ముళ్లు! ఈ సందర్భంగా… ఆ ఫోన్ కాల్ లో ఏమి జరిగింది, ఏమి మాట్లాడారు, ఎలాంటి హామీలిచ్చారు అనేది మాత్రం సామాన్యుడికి తెలియదు… “ఎవరైనా వినిపిస్తే తప్ప” అనే కామెంట్లు పడుతుండటం కొసమెరుపు!

Read more RELATED
Recommended to you

Exit mobile version