ఏపీలో 23 వేల ఎకరాల్లో గంజాయి సాగు..చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!

రాష్ట్రపతిని కలిసిన అనంతరం టిడిపి అధినేత చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇలా ఏ రాష్ట్రం లోనూ గంజాయిని పట్టుకున్నా దాని మూలాలు మాత్రం ఏపీ లోనే ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 23 వేల ఎకరాల్లో గంజాయి సాగు పెద్ద ఎత్తున జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. గుజరాత్ లోని ఎయిర్ పోర్ట్ లో 21 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడిందని దానిపై విచారణ జరిపితే చివరకు అది విజయవాడ సత్యనారాయణపురం అడ్రస్ బయటకు వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.chandrababu naidu

ఆంధ్ర ప్రదేశ్ నుండి ఆస్ట్రేలియా వరకూ డ్రగ్స్ ఎగుమతి అవుతున్న విషయం బయట పడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం జగన్ నాసిరకం మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా దొరకని బ్రాండ్లను ఏపీలో అమ్ముతున్నారని అన్నారు. అభివృద్ధిలో నెంబర్వన్ గా ఉన్న ఏపిని జగన్ డ్రగ్స్ లో నెంబర్ వన్ లో చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. టిడిపి కార్యాలయం పై టిడిపి నేత పట్టాభి ఇంటిపై జరిగిన దాడులు డిజిపి మరియు సీఎం ఆధ్వర్యంలో జరిగాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.