ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తుంది – చంద్రబాబు

-

ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. అక్రమ అరెస్టులపై పోలీసులు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం మీరు చేసే చట్ట ఉల్లంఘనలు మిమ్మల్ని సైతం బోనులో నుంచో పెడతాయి. మీరు మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.

అక్రమ అరెస్టు లకు సమాధానం చెప్పుకోవాల్సిన స్థితికి ఏపీ పోలీస్ శాఖను తీసుకువచ్చింది ఎవరు? తమ తప్పుడు వైఖరికి సిఐడి సిగ్గు పడాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో చట్ట ఉల్లంఘనలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ ఘటన ద్వారా మరో సారి నిరూపితం అయ్యిందన్నారు. ప్రజలను, రాజకీయ పక్షాలను భయపెట్టేందుకు అధికారం పూర్తిగా దుర్వినియోగం అవుతుంది. రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తుంది అనడానికి ఇంతకంటే ఏం రుజువులు కావాలి? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news