డీజీపీకి చంద్రబాబు లేఖ… ఎందుకంటే…!

-

రాష్ట్రంలో ప్రాదమికహక్కులకు అడుగడుగునా భంగం వాటిల్లుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయన డీజీపీ గౌతం సవాంగ్ కి ఆయన లేఖ రాసారు. పోలీస్ లపై వ్యక్తిగతంగా రిజిస్టర్ అయిన కేస్ ల విషయం లో ఏపీ పోలీస్ లు ప్రధమ స్థానం లో వున్నారని, శాంతిభద్రతలు క్షీణించడం, ప్రాధమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడటం అనేక దుర్ఘటనలకు ఆంధ్రప్రదేశ్ వేదికగా మారిందని ఆయన లేఖలో ఆరోపించారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)ఏ కల్పించిన వాక్ స్వాతంత్ర్యంపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడులు నిత్యకృత్యం అయ్యాయని ఆయన విమర్శించారు.

వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నించినవారిని వెంటాడటం, అర్ధరాత్రి అరెస్ట్ లు, హింసాత్మక దాడులు, ఆస్తుల విధ్వంసం, బెదిరింపులు, దుర్భాషలు, అసభ్య ప్రచారం ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దారుణం అని వ్యాఖ్యానించారు. పోలీసులలో ఈ విధమైన ఉదాసీనత, పట్టించుకోకపోవడం మంచిదికాదు, రాష్ట్ర చరిత్రలో మున్నెన్నడూ ఇలాంటి పరిస్థితి లేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులపైనే వ్యక్తిగత కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయని ఎన్ సిఆర్ బి నివేదిక చెపుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

దేశవ్యాప్తంగా పోలీసులపై మొత్తం 4,068 కేసులు నమోదైతే అందులో 1,681 కేసులు(41%) ఆంధ్రప్రదేశ్ లోనే నమోదు కావడం ఆందోళనకరం అని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయం ఎదుటే షేక్ సత్తార్ పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసుకోవడం దీనికి మరో ఉదాహరణ అన్నారు చంద్రబాబు. మైనారిటీ తీరని కుమార్తెను అధికార వైసిపికి చెందిన వ్యక్తి అసభ్యంగా వేధించాడని విమర్శించారు. షేక్ సత్తార్ కుటుంబం ఫిర్యాదు మేరకు ఐపిసి సెక్షన్లు 354, 506 r/w 34 , 11 r/w 12 పోస్కో చట్టం 2012 కింద దీనిపై ఎఫ్ ఐఆర్ 578/2020 నమోదు చేశారని, ఇందులో నిందితుడు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కావడంతో ఈ కేసును ఉపసంహరించుకోవాలని సత్తార్ కుటుంబంపై పోలీసుల నుంచి వత్తిడి తెచ్చారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version