రూ. 100 కోట్లు ఆస్తిని పోగొట్టుకున్న చంద్రమోహన్!

-

ఈ ఉదయం టాలీవుడ్ సీనియర్ సినీ నటుడు మచ్చలేని చంద్రమోహన్ మరణించారు. ఈయన స్టార్ నటుడిగా ప్రజల మన్ననలు అందుకున్నప్పటికీ తన చివరి రోజుల్లో మాత్రం చాలా సాధారణమైన జీవితాన్ని గడిపి ఈలోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన చంద్రమోహన్, తన జీవితంలో రూ. 100 కోట్లు ఆస్తని పోగొట్టుకున్నానని చెప్పడం అందరికీ తెలిసిందే. సంపాదించిన దాని కంటే కూడా పోగొట్టుకున్నవే ఎక్కువంటూ తెలియచేశారు చంద్రమోహన్. తెలంగాణలోని కొంపల్లి లో 35 ఎకరాల ద్రాక్ష తోటను కొన్నాడట, కానీ దీనిని దగ్గరుండి చూసుకునే వారు లేకపోవడంతో చాలా తక్కువకే అమ్మేశాడట. అదే విధంగా మద్రాస్ లోనూ 15 ఎకరాలు ఉంటే అమ్మేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఆస్తులు ఆంటి విలువను చూస్తే రూ. 100 కోట్లకు పైగానే ఉంటుందని అప్పుడు ఇంటర్వ్యూ లో చంద్రమోహన్ చెప్పుకుని బాధపడ్డారు. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది.

ఇక అందరూ ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు మనిషే చనిపోయాక ఇక ఆస్తులు పెట్టుకుని ఏమి చేసుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news