కాసేపటి క్రితమే పాకిస్తాన్ మరియు ఇంగ్లాండ్ ల మధ్యన వరల్డ్ కప్ లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదలైంది. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ పరువు కోసం ఆడుతుంటే, పాకిస్తాన్ మాత్రం సెమిస్ కు వెళ్లాలన్న కసితోనే ఆడుతోంది. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏమిలాభం అన్న చందంగా ఇప్పుడు సెమీస్ చేరడం ఎంత కష్టమో తెలిసిందే. న్యూజిలాండ్ శ్రీలంక మధ్యన జరిగిన మ్యాచ్ లో విలియమ్సన్ సేనకు చాలా అనుకూలమైన ఫలితం రావడంతో నెట్ రన్ రేట్ బాగా డెవెలప్ అయింది. ఇప్పుడు పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే.. ఒకవేళ ఇంగ్లాండ్ 50 పరుగులు చేస్తే పాకిస్తాన్ 2 ఓవర్లలోనే చేధించాలి, ఇంగ్లాండ్ 100 పరుగులు చేస్తే 2 .5 ఓవర్లలో చేధించాలి, 200 పరుగులు చేస్తే 4 .3 ఓవర్లలో చేధించాలి, 300 పరుగులు చేస్తే 4 .1 ఓవర్లలో చేధించాలి.
అప్పుడు మాత్రమే న్యూజిలాండ్ కన్నా మెరుగైన రన్ రేట్ ను సాధించి పాకిస్తాన్ సెమీఫైనల్ కు వెళుతుంది. ఇది కనుక జరిగితే ప్రపంచంలో ఇప్పటి వరకు వన్డేర్స్ మాత్రమే ఉన్నాయి, ఇది 8వ వండర్ అవుతుంది.