టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ నవంబర్ 11న అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. చంద్రమోహన్ మరణ వార్త తెలుసుకొని పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి చంద్రమోహన్ పార్థివదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అభిమానుల సందర్శనార్థం దాదాపు రెండు రోజుల పాటు ఉంచారు.
తాజాగా హైదరాబాద్ పంజాగుట్టలోని స్మశాన వాటికలో చంద్రమోహన్ అంత్యక్రియలు జరిగాయి. శ్మశాన వాటిలో ఆయన సోదరుడు మల్లంపల్లి దుర్గాప్రసాద్ చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు జరిగాయి. తెలుగు, తమిళ భాషల్లో సుమారు 932 సినిమాల్లో నటించారు చంద్రమోహన్. టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగారు. ఈనెల 11న అనారోగ్యంతో జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో కన్నుమూసిన ఆయన.. అభిమానులను శోక సంద్రంలోకి నెట్టి ఇక సెలవు అంట దికెగారు. అంతిమ యాత్ర కంటే ముందు నటులు వెంకటేష్, రాజశేఖర్, జీవిత, నిర్మాత ఆదిశేషరావు, మాదాల రవి తదితరులు చంద్రమోహన్ బౌతిక ఖాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.